అదుపులోకి వచ్చిన కేజీబీవీ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి

61చూసినవారు
అదుపులోకి వచ్చిన కేజీబీవీ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి
కోటబొమ్మాళి మండల కేంద్రం లోని కేజీబీవీ విద్యాలయాన్ని జిల్లా ఆర్బీఎస్కే కో ఆర్డినేటర్ డాక్టర్ శ్రీదేవి మంగళవారం సాయంత్రం సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఒక్క విద్యార్థిని మాత్రమే శ్వాసకోశ సంబంధిత సమస్యతో స్థానిక సీహెచ్సీలో చికిత్స పొందుతున్నారని, ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందన్నారు. డిప్యూటీ పారా మెడికల్ ఆఫీసర్ వాన సురేష్ కుమార్, డా. అమృత, నీరజ, ప్రిన్సిపల్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్