టెక్కలిలో భారీ వర్షం

80చూసినవారు
టెక్కలిలో బుధవారం వేకువజామున నుంచి ఉరుములు, మెరుపులు గాలులతో వర్షం పడుతుంది. గత రెండు రోజులు కూడా వాతావరణం చాలా వేడిగా ఉండేది. రాత్రి సమయానికి వాతావరణంలో మార్పులు చోటుచేసుకున్నాయి. ఈ మేరకు బుధవారం ఉదయం నుండి టెక్కలి పరిసర ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో వీధిలో ఉండే డ్రైనేజీలు నిండిపోయి వర్షపు నీరు ప్రవహిస్తుంది.

సంబంధిత పోస్ట్