జలుమూరు మండల 108 వాహనాన్ని శుక్రవారం శ్రీకాకుళం జిల్లా ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కోఆర్డినేటర్ ఆర్. ప్రకాశ్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. వాహనంలో ఉన్న మందులు, పరికరాలను పరిశీలించి, పలు రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో 108 సిబ్బంది ఆర్. రమేష్, యు. పాపారావు పాల్గొన్నారు.