లోక్ అదాలత్ లో కేసులు రాజీ చేసిన జడ్జి ప్రసన్న లత

73చూసినవారు
లోక్ అదాలత్ లో కేసులు రాజీ చేసిన జడ్జి ప్రసన్న లత
మండల కేంద్రం కోటబొమ్మాలి కోర్టులో మండల న్యాయ సేవా సంఘం ఆధ్వర్యంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ జరిగింది. జూనియర్ సివిల్ జడ్జి ప్రసన్న లత లోక్ అదాలత్ నిర్వహించి ఎక్కువ సంఖ్యలో కేసులను రాజీ చేశారు. ఈ లోక్ అదాలత్ బెంచ్ కు మెంబర్లుగా న్యాయవాదుల సంఘం అధ్యక్షులు లఖినేని శ్రీనివాసులు, సీనియర్ న్యాయవాది వెలమల అప్పలనాయుడు వ్యవహరించారు. ఈ జాతీయ లోక్ అదాలత్ లో సుమారు 130 కేసులను రాజీ చేశారు.

సంబంధిత పోస్ట్