కోటబొమ్మాళి మండలం చిన్న బమ్మిడి పంచాయతీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శనివారం పాల్గొన్నారు. గ్రామానికి చేరుకున్న ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఎన్నడూ లేని విధంగా సంక్షేమ పథకాలు అందించిందన్నారు. అనంతరం కరపత్రాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.