ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు ప్రమాదంలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళితే కోటబొమ్మాలి మండలం చలమయ్య పేట జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంపై గురువారం రాత్రి రోడ్డు దాటుతుండగా శ్రీకాకుళం నుండి టెక్కలి వైపు వెళుతున్న కారు బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ఉన్న అప్పన్న, మల్లేశులకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.