కోటబొమ్మాళి వద్ద సిగ్నల్ అంతరాయంతో బరంపురం-విశాఖపట్నం ఇంటర్-సిటీ 18525 ఎక్స్ ప్రెస్ నిలిచిపోయింది. కోటబొమ్మాళి స్టేషన్ లో వెనక వచ్చే ట్రైన్ కోసం సర్వీస్ ట్రాక్ పై నిలిపి వేయడంతో సిగ్నల్ అంతరాయంతో సుమారు రెండు గంటలు ఆలస్యమైంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. సిబ్బంది సిగ్నల్ సరిచేయడంతో రైలు బయలుదేరింది.