కోటబొమ్మాళి మండల కేంద్రంలోని ప్రకాష్నగర్ కాలనీ సమీపంలో పలాస మండలం బ్రాహ్మణతర్ల గ్రామానికి చెందిన కోరాడ వాసుదేవరావు (58) చెట్టుకి ఉరివేసుకొని సోమవారం సాయంత్రం ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు కోరాడ వాసుదేవరావు ప్రకాశనగర్ కాలనీలో నివాసం ఉంటూ వంట పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మృతుడికి కూమారుడు పవన్ ఉన్నారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు.