
భారత్‌లో అత్యంత ఖరీదైన చిత్రం ఇదే
బాలీవుడ్లో తెరకెక్కుతున్న 'రామాయణ' సినిమా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తాజాగా విడుదలైన గ్లింప్స్ విజువల్స్ అద్బుతంగా ఉన్నాయంటూ గ్రాఫిక్స్ వర్క్‌పై ప్రశంసలు అందుతున్నాయి. ఈ మూవీ భారతదేశంలోనే అత్యంత ఖరీదైనదిగా రికార్డ్ నెలకొల్పనుంది. ఈ చిత్రం రూ.1600 కోట్ల బడ్జెట్‌తో రూపొందుతుండగా, మొదటి భాగం రూ.900 కోట్లు, రెండో భాగం రూ.700 కోట్లు ఖర్చవుతుందని సమాచారం.