కోటబొమ్మాలిలోని జూనియర్ కళాశాలలో బుధవారం మండల న్యాయ సేవా సంఘం అధ్యక్షులు, జూనియర్ సివిల్ జడ్జి బి. ఎం. ఆర్ ప్రసన్న లత ఆధ్వర్యంలో న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు భవిష్యత్తుపై దృష్టిని పెట్టాలన్నారు. అసాంఘిక చర్యలలో పాల్గొంటే జీవితం నాశనమవుతుందని హెచ్చరించారు. గుడ్ టచ్. బ్యాడ్ టచ్, తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.