కోటబొమ్మాళి మండల కేంద్రంలోని శ్రీ కొత్తమ్మతల్లిని శ్రావణమాసం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా మట్టి గాజులతో గురువారం అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకుడు కమ్మకట్ల రాజేష్‌రెడ్డి ఆద్వర్యంలో మహిళ భక్తులతో పెద్ద సంఖ్యలో అమ్మతల్లికి మట్టి గాజులు సమర్పించారు. గురు, శుక్రవారం కొత్తమ్మతల్లి గాజులమ్మ తల్లిగా భక్తులకు దర్శనమిస్తుందని ఆయన తెలిపారు. ఈవో వాకచర్ల రాధాక్రిష్ణ భక్తులకు ఉచితంగా ప్రసాదం పంపిణీ చేశారు.