కొత్తూరు: అంధకారంలో మగ్గిపోయిన ఆసుపత్రి

56చూసినవారు
కొత్తూరు: అంధకారంలో మగ్గిపోయిన ఆసుపత్రి
బుధవారం మధ్యాహ్నం భారీ ఈదురుగాలులకు విద్యుత్ నిలిచిపోవడంతో కొత్తూరు ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రం రాత్రి అంధకారంలో మగ్గిపోయింది. దీంతో రోగులు విష సర్పాల భయంతో ఆందోళనకు గురయ్యారు. కాగా నవజాత శిశువులు, బాలింతలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. వీరికి సెల్ఫోన్ వెలుతురులోనే వైద్యం అందించారు. ఇన్వెర్టర్లలలో చార్జింగ్ అయిపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. ఆసుపత్రిలో జనరేటర్ లేదని సమాచారం.

సంబంధిత పోస్ట్