శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మద్ అహ్మద్ ఖాన్ ను కలెక్టర్ కార్యాలయంలో గురువారం ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ జిల్లా అధ్యక్షులు బోకర నారాయణరావు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లాలో గల దళిత, ఆదివాసీ భూ సమస్య లను పరిష్కరించాలని కోరారు. ఆయనతో పాటు జిల్లా కార్యదర్శులు డి. రాము, చింతాడ శ్రీనివాస్, ఎమ్. అప్పారావు లు పాల్గొన్నారు.