టెక్కలిలో కూర్మ అవతారంలో దర్శనమిచ్చిన జగన్నాథ స్వామి

71చూసినవారు
టెక్కలిలో కూర్మ అవతారంలో దర్శనమిచ్చిన జగన్నాథ స్వామి
టెక్కలి మండల కేంద్రంలోని పెద్ద బ్రాహ్మణ వీధిలో జరుగుతున్న జగన్నాథుని రథయాత్ర ఉత్సవాలలో భాగంగా మంగళవారం మూడవ రోజు స్వామివారు కూర్మ అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ ఈఓ టీ. పీ మనస్వి పర్యవేక్షణలో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టెక్కలి పరిసర ప్రాంతాలు నుంచి భక్తులు ఆలయానికి వచ్చి పూజలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు తీర్థ ప్రసాదాలను అందించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్