టెక్కలి ఆదిత్య కళ్యాణ మండపంలో గురువారం మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతిని టెక్కలి ఇన్-ఛార్జ్ పేరాడ తిలక్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అణగారిన కుటుంబాలలో వెలుగులు నింపిన మహనీయుడు, వెనుకబడిన తరగతుల ఆశాజ్యోతి , ఇలాంటి మహానుభావుడిని అందరూ ఆదర్శప్రాయంగా తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు, జెడ్పిటిసిలు, సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.