మేజర్‌ రామగోపాల్‌ నాయుడికి ప్రతిష్ఠాత్మకమైన కీర్తిచక్ర

65చూసినవారు
మేజర్‌ రామగోపాల్‌ నాయుడికి ప్రతిష్ఠాత్మకమైన కీర్తిచక్ర
సంతబొమ్మాళి మండలం నగిరిపెంటకు చెందిన మేజర్‌ మళ్ల రామగోపాల్‌ నాయుడిని ప్రతిష్ఠాత్మకమైన కీర్తిచక్ర పురస్కారానికి కేంద్ర ప్రభుత్వం ఎంపికచేసింది. ఢిల్లీలో గురువారం స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి చేతుల మీదుగా ఆయన పురస్కారం అందుకున్నారు. 2012లో ఆయన సైన్యంలో చేరారు. 2023 అక్టోబరు 26న కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖలో భీకర కాల్పుల మధ్య జవాన్లతో కలిసి నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టారు.

సంబంధిత పోస్ట్