కోటబొమ్మాలిలో 29న జరిగే జాతీయ లోక్ అదాలత్ విజయవంతం చేయండి

62చూసినవారు
కోటబొమ్మాలి కోర్టులో న్యాయమూర్తి బి. ఎం. ఆర్ ప్రసన్న లత బుధవారం జాతీయ లోక్ అదాలత్ పై న్యాయవాదులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 29 న జరగబోయే జాతీయలోక్ అదాలత్ లో ఎక్కువ సంఖ్యలో కేసులు ముందుగానే గుర్తించి రాజీ చేసి విజయవంతం చేయాలని కోరారు. ప్రి లోకదాలత్ లు ప్రతి రోజు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాజీ పడే కేసులను గుర్తించి, కేసులు రాజీ చేయాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్