మెలియపుట్టి మండలం చాపర గ్రామానికి చెందిన యర్ర రామాలక్ష్మీ శనివారం ప్రమాదవశాత్తు మేడపై నుండి జారిపడిపోయింది. కుటుంబ సభ్యులు వెంటనే మెలియపుట్టి 108లో టెక్కలి జిల్లా హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. డ్యూటీ వైద్యులు అన్నెపు వినోద్, ఆర్థోపెడిక్ వైద్యులు రాజేష్ సమక్షంలో పరీక్షించి వెన్నెముకకు బలమైన గాయం అయ్యిందని కుటుంబ సభ్యులకు తెలియజేసి, శ్రీకాకుళం రిమ్స్ కు రిఫర్ చేశారు.