కోటబొమ్మాళి విద్యార్థిని మృతిపై విచారణకు మంత్రి ఆదేశం

72చూసినవారు
కోటబొమ్మాళి విద్యార్థిని మృతిపై విచారణకు మంత్రి ఆదేశం
కోటబొమ్మాళి మండలం నిమ్మాడ కాలనీకి చెందిన కొంచాడ నీలమ్మ(22) అనే విద్యార్థిని డెంగ్యూతో మృతి చెందడంపై విచారణ చేపట్టాలని రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ను గురువారం ఆదేశించారు. ఇటీవల కాలంలో ఆమె తీవ్రమైన జ్వరంతో టెక్కలి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి రావడం, అక్కడ వైద్యులు అందుబాటులో లేకపోవడంపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్