శాఖా గ్రంథాలయం నందిగాంలో బుధవారం వేసవి విజ్ఞాన శిబిరము సందర్భంగా ఉపాధ్యాయులు శంకర్రావు, గ్రంథాలయ అధికారి ఎస్. ఉదయ్ కిరణ్ అధ్యక్షతన సీనియర్స్, జూనియర్స్ విభాగం విద్యార్థులతో "న్యూస్ పేపర్ రీడింగ్" పోటీలు నిర్వహించడం జరిగింది. శంకర్రావు మాట్లాడుతూ న్యూస్ పేపర్ రీడింగ్ పట్ల అవశ్యకత, ప్రాధాన్యత వివరించారు. ప్రతిరోజూ అలవరుచుకోవడం వలన లోకజ్ఞానం, మేధాశక్తి పెంపొందించుకోగలరని తెలిపారు.