నందిగాం మండల దేవుపురం గ్రామంలో డిప్యూటీ తహశీల్దార్ రెయ్యి రామారావు ఆధ్వర్యంలో శనివారం రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఈ రెవెన్యూ సదస్సులో గ్రామ పెద్దలు గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమి ఎక్కడ వరకు ఉందో కచ్చితంగా తెలియడం లేదన్నారు. ప్రభుత్వ భూమికి సరిహద్దులు చూపాలని డిప్యూటీ తహశీల్దార్ ని కోరారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పాల్గొన్నారు.