నందిగాం: శాఖా గ్రంథాలయంలో "నీరు-మీరు" కార్యక్రమం

64చూసినవారు
నందిగాం: శాఖా గ్రంథాలయంలో "నీరు-మీరు" కార్యక్రమం
స్థానిక శాఖా గ్రంథాలయం నందిగాంలో నెలలో మూడవ శనివారం ప్రభుత్వం చేపట్టిన "నీరు - మీరు" కార్యక్రమంను గ్రంథాలయ అధికారి ఎస్. ఉదయ్ కిరణ్ అధ్యక్షతన విద్యార్థులతో నిర్వహించారు. ముందుగా గ్రంథాలయానికి విచ్చేసిన విద్యార్థులకు నీరు, మజ్జిగ పంపిణీ చెశారు. అనంతరం గ్రంథాలయ ఆవరణంలో పరిసరాల పరిశుభ్రత చేపట్టారు. గ్రంథాలయ అధికారి మాట్లాడుతూ.. ఎండల తీవ్రత దృష్టిలో ఉంచుకొని శరీరానికి అధికంగా మంచినీరు, మజ్జిగ తీసుకోవడం చాలా అవసరం అని తెలిపారు.

సంబంధిత పోస్ట్