టెక్కలి మండలం నరహరిపురం గిరిజన గ్రామంలోని రేషన్ డిపో వద్ద సిగ్నల్ సమస్యల కారణంగా మంగళవారం లబ్ధిదారులు వేలిముద్రలు పెట్టలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే ప్రభుత్వం సాంకేతిక సమస్యల ఉన్న చోట లబ్ధిదారుల సంతకాలు సేకరించి రేషన్ అందించాలని ఇటీవల ఆదేశాలు ఇచ్చింది. దీనిపై పరిశీలన చేసి తగిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.