టెక్కలిలో అధికారుల నిర్లక్ష్యం.. సాగునీరు ప్రశ్నార్థకం?

68చూసినవారు
టెక్కలిలో అధికారుల నిర్లక్ష్యం.. సాగునీరు ప్రశ్నార్థకం?
టెక్కలి నియోజకవర్గంలోని వంశధార ఎడమ ప్రధాన కాలువలో ఈ ఏడాది అధికారుల నిర్లక్ష్యం కారణంగా పూడికతీతలు పనులు జరగకపోవడంతో ఖరీఫ్ వ్యవసాయ సాగుకు సాగునీటి సరఫరా ప్రశ్నార్థకంగా మారింది. వేసవిలో వంశధార కాలువలో పూడికతీత పనులు చేపట్టాలి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా జూన్ నెల చివరికి కూడా పూడిక తీత పనులు చేయలేదు. దీంతో గుర్రపుడెక్కతో నిండి పోయిందని శుక్రవారం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్