ఇకపై ఆసుపత్రిలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవు

64చూసినవారు
టెక్కలి మండల కేంద్రంలోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో ఇకపై వైద్యులు, సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని టెక్కలి ఎమ్మెల్యే వ్యవసాయశాఖ మంత్రి కింజరాపు అచ్చన్న నాయుడు హెచ్చరించారు. టెక్కలి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో గురువారం ఆయన జిల్లా కలెక్టర్ తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆసుపత్రి పై ప్రజల్లో అసంతృప్తి ఉందని అన్నారు. ఇకపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్