టెక్కలిలో ఆదివారం ఓ ప్రైవేటు కార్యక్రమానికి వచ్చిన జనసేన పార్టీ నాయకులు శ్రీకాకుళం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ రవికుమార్, జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు చంద్రమోహన్ ను.. జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ పండా శాలువాలతో కప్పి సత్కరించారు. కార్యక్రమంలో పలాస నియోజకవర్గ జనసేన నాయకులు బాలకృష్ణ, అనిల్ కుమార్, మిథున్ కుమార్, శివ, లీగల్ సెల్ చిట్టిబాబు, తదితరులు పాల్గొన్నారు.