గుంతల రోడ్లపై అవస్థలు పడుతున్న ప్రయాణికులు

80చూసినవారు
టెక్కలి మండల కేంద్రం లోని టెక్కలి మెలియాపుట్టి ప్రధాన రహదారిలో వంతెన వద్ద ఏర్పడిన గుంతలు ప్రయాణికుల పాలిట శాపంగా మారాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డు మధ్యలో గుంతలతో ప్రయాణికులు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. టెక్కలి రోడ్డు గుంతలను పూడ్చి, మరమ్మతులు చేయాలని వాహనదారులు కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి చర్యలు చేపట్టాలని స్థానికులు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్