సంతబొమ్మాళి మండలం నౌపడ విద్యుత్ సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్తు సరఫరాకు అంతరాయంగా ఉన్న మొక్కలు నరికే పనులు చేపడుతున్నందున శనివారం ఉదయం 9 గంటల నుంచి 2 గంటల వరకు నౌపాడ నుండి భావనపాడు వరకు విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నామని టెక్కలి విద్యుత్ శాఖ ఈఈ జి శంకర్రావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.