కోటబొమ్మాలి మండల కేంద్రం లోని సామాజిక ఆసుపత్రిని ఇటీవల సందర్శించిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులకు ఆసుపత్రి చుట్టూ ఉన్న చెత్త మొక్కలను తీయించి వచ్చే రోగులకు ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఒక ర్యాంప్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు శుక్రవారం జేసీబీతో ఆసుపత్రి చుట్టుపక్కల చెత్తను పిచ్చి మొక్కలు తొలగించి శుభ్రంగా తీర్చిదిద్దారు.