రోడ్డు దుస్థితి.. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు

85చూసినవారు
రోడ్డు దుస్థితి.. ఇబ్బందులు పడుతున్న ప్రయాణికులు
కోటబొమ్మాళి - సంతబొమ్మాళి రెండు మండల కేంద్రాలను కలిపే రోడ్డు పూర్తిగా గోతులమయంగా మారడంతో వాహన చోదకులు బాటసారులు ఇబ్బందులు పడుతున్నారు. మూలపేట పోర్టు భారీ టిప్పర్ల కారణంగా ఈ గోతులు ఏర్పడ్డాయి. ఈ దారిలో ప్రయాణించడం వాహన చోదకులకు నరకంగా మారింది. రోజుకు కొన్ని వందల వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ రహదారిని మరమ్మతులు చేయాల్సిందిగా సంతబొమ్మాలి, కోటబొమ్మాలి మండలాల ప్రజలు మంగళవారం ఒక ప్రకటనలో కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్