సంతబొమ్మాళి మండలం నౌపడ గ్రామంలో శుక్రవారం జరిగిన గ్రామసభలో వి. కృష్ణ అనే టీడీపీ నాయకుడు తనపై దౌర్జన్యం చేశాడని నౌపడ ఎంపీటీసీ బీ. సుధాకర్ ఆరోపించారు. చికిత్స నిమిత్తం ఆయన టెక్కలి జిల్లా ఆసుపత్రిలో చేరారు. తనపై జరిగిన దాడి ఉదంతాన్ని మీడియాకు ఆయన తెలియజేశారు. దాడిపట్ల స్థానిక వైసీపీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఘటనపై నౌపడ పోలీసులు వివరాలు నమోదు చేసుకున్నారు.