సంతబొమ్మాళి మండలం నర్సాపురంలో నూతన సంవత్సర వేడుకల్లో పాల్గొన్న వైసీపీ కార్యకర్తలపై టీడీపీ కార్యకర్తలు దాడికి పాల్పడి గాయపరిచారని శుక్రవారం ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మీడియాకు తెలిపారు. దాడి ఘటనపై రాజీ కుదిరించేందుకు స్థానిక పోలీసులు పిలిపించి బాధితులపై మరోసారి చేయి చేసుకున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై న్యాయం కోసం హ్యూమన్ రైట్స్ కు ఫిర్యాదు చేస్తూ న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.