శ్రీకాకుళం జిల్లా నుంచి ఉత్తమ అభ్యుదయ రైతుగా సంతబొమ్మాళి లక్ష్మీపురం గ్రామానికి చెందిన తంగి విజయరమణమూర్తి ఎంపికయ్యారు. శనివారం గుంటూరు విజ్ఞాన్ వ్యవసాయ యూనివర్సిటీలో సంక్రాంతి సంబరాలు కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు అభ్యుదయ రైతును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కె. అచ్చెన్నాయుడు సన్మానించి, అభ్యుదయ రైతు పురస్కారం అందజేశారు.