సంతబొమ్మాళి ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం మొదటి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రిబాయి పూలే జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులు మయూరి, భవాని, రోజారమణి, రజిని, పావని, ప్రవల్లికలను గ్రామ పెద్దలు మెండ అప్పారావు, కూచెట్టి కాంతారావు, పప్పు కృష్ణారావు దాచెట్టి కృష్ణారావు విద్యా కమిటీ చైర్మన్ చింతలపూరి అప్పారావు పాఠశాల సిబ్బంది సన్మానించారు.