శ్రావణ శుక్రవారం.. ఆలయాల్లో భక్తుల రద్దీ

56చూసినవారు
శ్రావణ శుక్రవారం.. ఆలయాల్లో భక్తుల రద్దీ
టెక్కలి మండల కేంద్రంలోని పలు అమ్మవారి ఆలయాల్లో శ్రావణ శుక్రవారం పర్వదినం సందర్భంగా శుక్రవారం భక్తుల రద్దీ కనిపించింది. స్థానిక సంతోషిమాత ఆలయం, జగద్ధాత్రి ఆలయం, నీలమణిదుర్గ ఆలయం, కిల్లి పోలమ్మతల్లి అమ్మవారి ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపించింది. శుక్రవారం వేకువజాము నుంచి భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. టెక్కలి పరిసర ప్రాంత భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారు.

సంబంధిత పోస్ట్