టెక్కలి మండల కేంద్రం గొల్ల వీధికి చెందిన నిరుపేద బర్ల కృష్ణ అనారోగ్యంతో బాధపడుతూ ఇల్లు కదల లేక పూట గడవడం కూడా కష్టంగా మారింది. దీనిపై స్పందించిన సంతబొమ్మాళి మండలం బడే కుప్పన్నపేటకి చెందిన కె. పి స్పందన ఫౌండేషన్ ఆదివారం ఒక నెలకు సరిపడా 25 కేజీల బియ్యం , 25 రకాల నిత్యవసర సరుకులు, వైద్య ఖర్చులకు 1500 రూపాయలు అందించారు. కార్యక్రమంలో షణ్ముఖ మాస్టర్, సిమ్మన్న, శివారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.