శ్రీకాకుళం జిల్లాలో ఏప్రిల్ 15 నుంచి వేట నిషేధం ప్రభుత్వం విధించింది. ఈ మేరకు ఇచ్చాపురం నుంచి రణస్థలం వరకు ఉన్న మత్స్యకారు గ్రామాల్లో వేట చేయరాదని సమాచారం అందించడం జరిగిందని జిల్లా ఫిషరీస్ అసిస్టెంట్ డైరెక్టర్ సత్యనారాయణ మంగళవారం తెలిపారు. 61 రోజులపాటు సముద్రంలో మత్స్యకారులు వేట చేయరాదన్నారు. ఆ సమయంలో సముద్రపు జీవరాశులు గుడ్లు పెట్టి పిల్లలను ఉత్పత్తి చేసే సమయం అయినందున వేటనిషేధిస్తున్నట్లు ఆయన తెలిపారు