బంగాళాఖాతంలో ఏర్పడిన 'దానా' తుఫాను పట్ల జిల్లా అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. తుఫాను తీవ్రత నేపథ్యంలో ఈనెల 24 నుంచి జిల్లాలో భారీ వర్షాలు కురవనున్నాయని, వాతావరణ శాఖ అధికారులు ప్రకటించిన నేపథ్యంలో సముద్ర, తీర ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా చూడాలన్నారు.