అజాది కా అమృత మహోత్సవంలో భాగంగా కోటబొమ్మాళి రైతు బజారు నుంచి కొత్తపేట వరకు కోటబొమ్మాలి మండలం చీపుర్లపాడు పంచాయతీ లోని అదిత్య ప్రైవేటు పాఠశాల విద్యార్ధులు 50 అడుగుల భారత జాతీయ పతాకంతో గురువారం ర్యాలీ నిర్వహించారు. విద్యార్ధులు మెయిన్ రోడ్డులో భారత్‌మాతాకు జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంతకు ముందు పాఠశాలలో జాతీయ జెండాను అవిష్కరించి విద్యార్ధులకు స్వీట్స్ పంపిణీ చేశారు.