చిన్ననారాయణపురంలో టీడీపీ విజయోత్సవ వేడుకలు

79చూసినవారు
టెక్కలి మండలం చిన్ననారాయణ పురంలో ఆదివారం టీడీపీ విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. టీడీపీ నాయకులు ఆధ్వర్యంలో గ్రామంలో కేక్ కట్ చేసి, బాణసంచా కాల్చి పాటలతో సంబరాలు జరుపుకున్నారు. వేడుకలలో టెక్కలి మండల టీడీపీ అధ్యక్షుడు బగాది శేషగిరి, టీడీపీ నాయకులు దాసరి వాసు, ఇప్పిలి జగదీష్, బడే జగదీష్, నర్తు కృష్ణారావు, దాసరి శ్రీను, జనసేన నాయకుడు అనపాన జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్