నౌపడ పంచాయతీలో టీడీపీ విజయోత్సవ ర్యాలీ

56చూసినవారు
సంతబొమ్మాలి మండలం నౌపడ పంచాయతీ పరిధిలోని నౌపడ, కూర్మనాథపురం, సీతానగరం, పాలవానిపేట, జగన్నాథపురం గ్రామాల్లో శుక్రవారం టీడీపీ శ్రేణులు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. నౌపడ గ్రామ పంచాయతీ యువ నాయకులు సుగ్గు శాంతి స్వరూప్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ విజయోత్సవ ర్యాలీ జరిగింది. ఈ సందర్భంగా ప్రజలు స్వచ్చంధంగా టీడీపీ నాయకులకు నుదుట కుంకుమ దిద్ది మంగళ హారతులతో ఘనంగా స్వాగతం పలికారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్