ఉపాధ్యాయ వృత్తి అన్ని వృత్తుల కంటే పవిత్రమైనదని కోటబొమ్మాలి మండల పరిషత్ అద్యక్షుడు రోణంకి ఉమామల్లేశ్వరరావు అన్నారు. కోటబొమ్మాలి మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో మండల విద్యాశాఖాధికారి 1 సంపతిరావు అప్పలరాజు పదవీ విరమణ కార్యక్రమం బుధవారం జరిగింది. ఈ సందర్భంగా ఎంఈఓ కి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఎంపీడీవో వై. పద్మజ, వైస్ఎంపీపీ బోయిన నాగేశ్వరరావు, ఎంఈఓ ఎల్ వి ప్రతాప్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.