సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ సీతంపేట ఆధ్వర్యంలో 100% రాయితీతో ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమం శుక్రవారం టెక్కలి మండలంలోని డమరా, జి జగన్నాధపురం, లంకపాడు, పాలసింగి నరహరిపురం, పాత్రపురం గ్రామాలలో నిర్వహించారు. మత్స్యశాఖ అభివృద్ధి అధికారి ధర్మరాజు పాత్రో మాట్లాడుతూ, ఈ కార్యక్రమం గ్రామాలను ఆర్థికంగా అభివృద్ధి చేస్తుందని తెలిపారు. ఐటిడిఏ అధికారి వి శ్రీనివాసరావు, మత్స్యశాఖ సహాయకులు పాల్గొన్నారు.