టెక్కలి: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

74చూసినవారు
టెక్కలి: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం
టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రిన్సిపల్ టి. గోవిందమ్మ గురువారం తెలిపారు. కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్, డొమెస్టిక్ నాన్ వాయిస్, ఫ్రంట్ ఆఫీస్ అసిస్టెంట్ కోర్సుల్లో 3 నెలలు ఉచిత శిక్షణ ఉంటుందని తెలిపారు. ఇంటర్, ఆపై చదువుకున్న వారు అర్హులని చెప్పారు. ఈ నెల 5వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్