సంతబొమ్మాళి మండలం నౌపడలో శతాధిక వృద్ధురాలు చెన్నూరు కమల (101) శుక్రవారం మృతి చెందారు. ఈమె గతంలో మహిళా మండలి అధ్యక్షురాలుగా పనిచేసి ఎంతోమంది మహిళలకు కుట్టు మిషన్లు అందజేసి, టైలరింగ్ లో శిక్షణ ఇప్పించారు. ఈమె నాలుగు తరాలు కుటుంబ సభ్యులతోనూ ముని మనువలు, ముని మనవరాళ్లుతో కలిసి జీవించారు. ఈమెకు ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.