ప్రతి ఒక్కరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని టెక్కలి సీఐ అంబటి విజయ్ కుమార్ సూచించారు. ఆర్టీసీ డిపో సమీపంలో సోమవారం రాత్రి ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేయరాదన్నారు. ర్యాష్ డ్రైవింగ్ చేయకూడదని, వాహన పత్రాలు తప్పనిసరిగా వాహనంలో ఉంచుకోవాలని సూచించారు. సరైన పత్రాలు లేని వారికి జరిమానా విధించడం జరిగింది.