రైతుల జీవన విధానంపై గురువారం అధికారుల బృందం పరిశీలన చేశారు. ఈమేరకు టెక్కలి మండలం పాలసింగి రెవెన్యూ పరిధిలోని జగన్నాథపురంలో అధికారులు పర్యటించారు. రైతుల జీవనం, వ్యవసాయ పద్ధతులు, యాంత్రీకరణ, ఇతర ముఖ్యమైన అంశాలపై వివరాలు సేకరించారు. కార్యక్రమంలో జిల్లా సీపీఓ కార్యాలయ అధికారి కాళీ ప్రసాద్, టెక్కలి ఆర్డీవో కార్యాలయం ఉపగణాంక అధికారి పీసీ నంద, సహాయ గణాంక అధికారి మురళీకృష్ణ ఉన్నారు.