టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సును శుక్రవారం ప్రిన్సిపాల్ డా, గోవిందమ్మ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంలో టెక్కలి ఎస్సై కె రాము మాట్లాడుతూ ప్రస్తుత యువత ముఖ్యంగా విద్యార్థులు ఆన్ లైన్ మోసాలకు గురై పెద్ద మొత్తంలో డబ్బులు పోగొట్టుకుంటున్నారని ఆయన తెలియజేశారు. సైబర్ నేరాలపై విద్యార్దులు అప్రమత్తంగా ఉండాలని తెలియజేస్తూ సైబర్ నేరాలపై కొన్ని సూచనలు ఇచ్చారు.