చాకిపల్లి పాఠశాలలో డిఇఓ తిరుమల చైతన్య తనిఖీలు

84చూసినవారు
చాకిపల్లి పాఠశాలలో డిఇఓ తిరుమల చైతన్య తనిఖీలు
టెక్కలి మండలం చాకిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. తిరుమల చైతన్య సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది, విద్యార్థులతో మాట్లాడిన ఆయన పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పదో తరగతి విద్యార్థుల ప్రగతిపై సిబ్బందితో మాట్లాడారు. అనంతరం పాఠశాల పరిసరాలను, మధ్యాహ్న భోజనం పరిశీలించారు. డిప్యూటీ డీఈవో విలియమ్స్, ప్రధానోపాధ్యాయులు ఉన్నారు.

సంబంధిత పోస్ట్