టెక్కలిలోని భగవాన్ శ్రీ సత్యసాయి సేవా సమితి పెద్ద మందిరంలో ఆదివారం మహిళలకు కుట్లు, కటింగ్ శిక్షణను ప్రారంభించారు. ఇందుకు ఉషారాణి పర్యవేక్షణలో శిక్షణ శిబిరాన్ని.. కన్వీనర్ మల్లేశ్వరరావు ఏర్పాటు చేశారు. ప్రతిరోజు 20 నుండి 30 మంది మహిళలు శిక్షణ తీసుకోవచ్చునని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో డీవీ ప్రసాద్, వేణుగోపాల్ రావు, కె వైకుంఠ రావు, బాలకృష్ణ, టి. లక్ష్మీకాంతం పాల్గొన్నారు.